మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)ఉత్సాహంతో, చురుకుగా వ్యక్తిగత అభివృద్ధి కొరకు నూతన ఆలోచనలు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు కూడా అధికం. కుటుంబంలోని వ్యక్తులకి వృత్తిపరంగా నూతనఅవకాశాలు. దూర ప్రయాణాలకు అవకాశం. ఉన్నత స్థాయిలో ఉన్న పెద్దల సహకారం బాగుంటుంది. విద్యార్థులు అధిక శ్రమతో మంచి ఫలితాలు సాధించగలరు. కమ్యూనికేషన్ బాగుంటుంది, వ్రాత నైపుణ్యాలని పెంచుకుంటారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి మంచి గురువు లభ్యం. తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలం. స్థిరాస్తులు, నూతన వాహనాలు, గృహ సంబంధ అంశాల కొరకు ఖర్చులు అధికంగా ఉంటాయి. మరిన్ని మంచి ఫలితాలు కొరకు ఇష్ట దేవతా ప్రార్థన మంచిది
వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)
శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిద్రలేమిని అధిగమించాలి. దగ్గర ప్రయాణాలకు అవకాశం, తండ్రి ఆరోగ్యము శ్రద్ధ తీసుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలలో జాగ్రత్తలు అవసరం. ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. వ్యక్తిగత శ్రద్ధ, కొత్త నిర్ణయాలు, స్నేహితుల సహకారం, విదేశీ విద్య, వ్యవహారాల కొరకు చక్కని ఆలోచనలు. కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలు అవసరం. దూరప్రదేశాలలో దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ప్రణాళికలు. పట్టుదల ఉపయోగించి శక్తి సామర్థ్యాలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు, తోబుట్టువుల సహకారం అనుకూలం. కుటుంబ సమావేశాలలో పాల్గొంటారు. మరిన్ని మంచి ఫలితాల కొరకు సూర్యనారాయణ స్వామి ఆరాధన మంచిది.
మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)
ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు అనుకూలం, ఎదురుచూస్తున్న వర్తమానాలు అందుకుంటారు, ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. భూసంబంధ విషయాలు అనుకూలం, వారత్వ ఆస్తుల అంశాలు ఆలోచనలు, పూర్వ బాకీలు వసూలు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వృత్తిపరమైన విషయాలలో అధిక శ్రమ, అనవసర చికాకులు, ప్రశాంతత తక్కువగా ఉంటుంది, ఆకస్మిక దూర ప్రయాణాలకు అవకాశం. యోగ మెడిటేషన్ మంచిది. సంతానం యొక్క అభివృద్ధి కొరకు ఖర్చులు అధికం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. కొత్త వృత్తి కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక సంబంధ నిర్ణయాలలో కుటుంబములోని వ్యక్తులతోచర్చలు. పలుకుబడి కలిగిన ఉన్నతస్థాయి వ్యక్తుల, తోబుట్టువుల సహకారం సామాన్యం. మంచి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు.
కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)
వ్యక్తిగతంగా వృత్తిపరమైన అంశాలలో, సంతాన సంబంధ అభివృద్ధి విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. వృత్తిలో నూతన మార్పులు, అవకాశాలు. ఆర్థిక విషయాలలో ఆలస్యమైనా ఎదుగుదల కనబడుతుంది. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు ముందుకు కదులుతాయి. ఆధ్యాత్మిక ఆలోచన, ఖర్చులు ఆనందాన్నిస్తాయి. దూర ప్రయాణాలకు అవకాశం, అందులో జాగ్రత్తలవసరం. నూతన వాహనాలు కొనుగోలు కొరకు ప్రయత్నాలు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ, ఖర్చులు. నూతన అవకాశాలు సద్వినియోగపరుచుకునే దిశగా కొత్త ఆలోచనలు చేస్తారు. నూతన వ్యక్తుల స్నేహ సంబంధాలు విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టువులతో అపార్థాలకు దూరంగా ఉండాలి. మరిన్ని మంచి ఫలితాలకు విష్ణుమూర్తి ఆరాధన శుభం.
సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)
పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత విద్య ,దూర ప్రయాణాలు కొరకు ఖర్చులు అధికం, విద్యార్థులు ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధించడానికి అధికంగా శ్రమ పడతారు. పుణ్య బలాన్ని పెంచుకుంటూ భాగస్వామ్య వ్యవహారాలలో, అసంతృప్తిని అధిగమించాలి. అధికశ్రమతో వృత్తిపరమైన విషయాలలో అవకాశాలు లభ్యమైనా, వాటిని సద్వినియోగ పరుచుకునేందుకు చేసే ప్రయత్నాలలో పై అధికారులతో ముఖ్యంగా స్త్రీలతో వినయముతో వ్యవహరించాలి. ఆర్థిక విషయాలు, ఎదురు చూస్తున్న అంశాలు, సంతాన అభివృద్ధి అనుకూలంగా ఉంటాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆత్మీయ వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. మంచిఫలితాల కై దత్తాత్రేయ ఆరాధన మేలు.
కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)
ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యాలు ఆటంకాలు కొంత చికాకుని కలిగిస్తాయి. స్నేహ సంబంధాలు, ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. కుటుంబ సభ్యుల ఆరోగ్య, మరియు వ్యక్తిగత, ఆర్థిక విషయాలలో శ్రద్ధ తీసుకుంటారు. విద్యార్థులు విద్యాసంబంధ అంశాలపై తగిన కృషితో, శ్రద్ధతో ముందుకువెళ్లాలి. నిరుద్యోగులకు శ్రమతో నూతన అవకాశాలు. భాగస్వామ్య వ్యవహారాలలో అసంతృప్తిని అధిగమించాలి. ఆలోచనలలో ఆలస్యాలు, సమయానికి వెంటనే స్ఫూరించక పోవడం వల్ల, అవకాశాలని సద్వినియోగ పరచుకోవడంలో ఇబ్బందులు. వృత్తిపరమైన ఎదుగుదల ఆశాజనకంగా ఉంటుంది చివరిలో ఎదురుచూస్తున్న విషయాలు, ఆర్థిక అంశాలు ప్రశాంతతనిస్తాయి. ముఖ్యంగా ఆశించిన వ్యక్తుల యొక్క సహకారం, కుటుంబ వ్యక్తుల అభివృద్ధి ఆనందాన్నిస్తాయి. మంచి ఫలితముల కొరకు అమ్మవారి ఆరాధన మేలు.
తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)
సాంఘిక సంబంధాలు, నూతన వ్యక్తులతో పరిచయాలు, సంఘంలో గుర్తింపు గౌరవం మొదలైన విషయాలలో జాగ్రత్తగా దృష్టి సారిస్తారు. వృత్తి, వ్యాపార వ్యవహారాలు, ఆర్థిక అంశాలుకి సంబంధించిన అంశాలలో జీవిత భాగస్వామితో కలిపినిర్ణయాలు తీసుకునేటప్పుడు ఘర్షణతో కూడిన నిర్ణయాలని అధిగమించాలి. కుటుంబ వ్యవహారాలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్య, ఆహార విషయంలో తగిన శ్రద్ధ అవసరం. వృత్తిపరంగా ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎదురైనప్పటికీ సమయస్ఫూర్తిగా, విమర్శలను సైతం అధిగమించ గలుగుతారు. ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రయాణాలు, పెద్దల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. వృత్తిపరమైన విషయాలలో సమస్యల్ని అధిగమించడానికి పలుకుబడి కలిగిన ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని సమయానికి పొందగలరు. కమ్యూనికేషన్ బాగుంటుంది. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు.
వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)
ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ, భూ అంశాలలో బంధువులతో కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. వృత్తిపరమైన విషయాలలో ఉన్నత స్థాయి వ్యక్తులు సహకారంతో మంచి అవకాశాలు. సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, నూతన మైత్రి బంధాలను పెంపొందించుకుంటారు. జీవిత భాగస్వామితో అనుకూల వాతావరణం. దూర ప్రయాణాలకు అవకాశాల అధికం. సంతాన అభివృద్ధి విషయంలో, ఆర్థిక, పెట్టుబడుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పరిశోధన చేసే విద్యార్థులకు నూతన అవకాశాలు. చివరిలో ముఖ్యమైన పనులలో ఆలస్యాలు ఆటంకాలు చికాకును కలిగిస్తాయి. కుటుంబ వ్యక్తుల కొరకు ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. తండ్రి ఆరోగ్యం సామాన్యం సామాజిక సేవ చేస్తారు. మంచి ఫలితాల కొరకు విఘ్నేశ్వర ఆరాధన మేలు.
ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)
సంతాన వర్గం అభివృద్ధి, విందు వినోదాలు విషయంలో, దీర్ఘకాలికి పెట్టుబడుల కొరకు ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. ఉద్వేగాలతో కూడిన ఆలోచనలను అధిగమించాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. సంతానానికి సంబంధించి విదేశీ వ్యవహారాలు, ఉన్నత విద్య విషయంలో రుణముల విషయంలోనూ ఆత్మీయైన వ్యక్తులను సంప్రదించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు అధిక శ్రమతో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి పోటీ పరీక్షల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య, ఆహార, విశ్రాంతి విషయంలో శ్రద్ధ అవసరం. నిర్లక్ష్యం తగదు. సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. శ్రమకి తగిన ప్రతిఫలాన్ని పొందగలరు. అనవసర ఖర్చుల విషయంలో నియంత్రణని పాటిస్తూ, మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటూ ముందుకు వెళితే మేలు. మంచి ఫలితాల కొరకు శ్రీకృష్ణ మందిరాలు దర్శనమేలు
మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)
గృహ వాహన సౌఖ్యం ఉంటుంది. తల్లి గారి ఆరోగ్యం, కుటుంబ వ్యక్తుల సహకారం కొంత అనుకూలం. విద్యార్థులకు విద్యాపరంగా అభివృద్ధి. నూతన విషయాలు నేర్చుకుంటారు. అయినప్పటికీ పఠన, వ్రాత నైపుణ్యాలని పెంపొందించుకోవాలి, పరీక్ష వ్రాసేటప్పుడు వారి కొరకు పెద్దవారు జ్ఞాపకశక్తి విషయంలో శ్రీహైగ్రీవాయ నమః శ్లోకం పఠన మేలు. వాహనాలు నడిపేటప్పుడు తగిన శ్రద్ధ అవసరం. ప్రత్యర్థులు ఇబ్బందిపెట్టె ప్రయత్నం చేసినప్పటికీ మీ కృషిశీలతతో అధిగమించ గలుగుతారు. బంధువర్గంతో చర్చలు జరిపేటప్పుడు వినయం అవసరం. సాంఘిక సంబంధాలు మైత్రి బంధాలు అనుకూలంగా ఉంటాయి, వ్యాపార వ్యవహారాల విషయంలో మాటపట్టింపులకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామికి అభివృద్ధి, నూతన అవకాశాలు. వారి అభివృద్ధిలో మీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తారు. మంచి ఫలితాల కొరకు ఆదిత్య హృదయ పారాయణ మేలు.
కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)
సంపూర్ణ శక్తి సామర్థ్యాలు ఉపయోగించి శ్రమతో అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయగలుగుతారు. మిత్రులు, తోబుట్టువుల సహకారం సామాన్యం. వృత్తిపరమైన విషయాలలో అనవసరమైన గాసిప్స్ కి దూరంగా ఉండాలి. శ్రమ అధికం, నిద్రలేమి, సమయానికి ఆహార స్వీకరణ అవసరం. ఉన్నత స్థాయి వ్యక్తులతో వృత్తిపరమైన అంశాలలో అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార అంశాలలో కృషి అధికం. నూతన గృహ,వాహన మార్పుల కొరకు ఆర్థిక విషయాలలో తల్లితండ్రులతో చర్చిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, స్థిరాస్తులు మొదలైన విషయాలలో చర్చలు మిశ్రమ ఫలితాలు. మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఇవ్వరాదు. సంతానం అభివృద్ధి. ఆలోచనలు అనుకూలం. స్పెక్యులేషన్ మొదలైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రతిభతో పోటీలలో నెగ్గుతారు. ఖర్చులు శ్రమ అధికం. పూర్వపు రుణాలు రావడం కష్టం అని గ్రహిస్తారు. సత్యనారాయణ స్వామి ఆరాధన మంచిది.
మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)
ఆర్థిక అంశాలు , కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది, మంచి నిర్ణయాలు. తండ్రి పెద్దల సహకారం అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ భూమి, గృహముల పై ఆదాయాన్ని అందుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు సహకారంతో అనుకున్న పనులు సాధించు కోగలుగుతారు. ప్రయాణాలలో అనవసరమైన ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం, ఆరోగ్యం మీద శ్రద్ధ. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు. సమయ స్పూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలం. జీవిత భాగస్వామికి అభివృద్ధి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. గృహ వాతావరణం, నూతన వస్తు సేకరణ ఆనందాన్ని ఇస్తాయి. ఆలోచనలు ఫలిస్తాయి. వృత్తిపరమైన అభివృద్ధి. మానసిక ప్రశాంతత. మిత్రులతో, కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి ఫలితాల కొరకు శివాలయ సందర్శనమేలు.
(గమనిక: గోచార రీత్యా చెప్తున్న రాశి ఫలితాలు జనరల్ వి, వ్యక్తిగతంగా ఉద్దేశించి చెబుతున్నవి కావు, వ్యక్తిగత జన్మజాతకంలో అనగా వ్యక్తి జన్మ కుండలి (జన్మించిన సమయం, తేదీ, ప్రదేశం ఆధారంగా నిర్మించేది) ప్రకారం నడిచే దశలు అంతర్దశలు ప్రధానంగా చూసుకుంటూ ఆ దశ అంతర్దశలకు సంబంధించిన దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ, దానితో పాటు ఈ గోచార ఫలితాలను చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు).
డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani
జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant
email : padma.suryapaper@gmail.com
www.padmamukhi.com
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa