ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 04, 2026, 03:18 PM

 సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. సుమారు రెండున్నర గంటలపాటు వారిద్దరూ కీలక అంశాలపై చర్చించారు. కుల రాజకీయాలను వైసీపీ రెచ్చగొడుతోందని, ఆ కుట్రలను ఎదుర్కొనేందుకు నేతలిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనికోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. త్వరలో ఖాళీకానున్న 4 రాజ్యసభ స్థానాలపైనా చంద్రబాబు, పవన్ ప్రాథమికంగా చర్చించినట్లు తెలుస్తోంది.కుల రాజకీయాలను వైకాపా రెచ్చగొడుతోందని.. ఆ కుట్రలను ఎదుర్కొనేందుకు, ఆ పార్టీ ట్రాప్‌లో పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని నేతలిద్దరూ నిర్ణయానికి వచ్చారు. దీనికోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కిందిస్థాయిలో తెదేపా, జనసేన క్యాడర్‌ మధ్య చిచ్చుపెట్టేలా వైకాపా చేస్తున్న కుట్రలకు చెక్‌ పెట్టేలా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa