ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర రాజకీయ పరిణామాల దృష్ట్యా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 04, 2026, 03:22 PM

సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఈరోజు కీలక భేటీకి సిద్ధమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు తిరుపతి లడ్డూ వివాదం ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కేబినెట్ విస్తరణ అంశాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈరోజు ఉదయం 10.40 గంటలకు వీరి సమావేశం ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. హైదరాబాద్ నుంచి పవన్ కల్యాణ్ ఉదయమే నేరుగా ఉండవల్లికి చేరుకోనున్నారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించిన తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి సిట్ నివేదికతో పాటు ఇతర అంశాలపై ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ తెలుస్తోంది. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో గత నాలుగు రోజులుగా వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పటివరకు ఈ అంశంపై టీడీపీ మాత్రమే ప్రత్యక్షంగా దూకుడుగా స్పందిస్తుండగా, ఇకపై కూటమి మొత్తం కలిసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa