ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని ప్రసంగంలో పనికొచ్చే అంశం ఒక్కటీ లేదని మల్లికార్జున ఖర్గే విమర్శలు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 06, 2026, 07:47 PM

రాహుల్ గాంధీలో, కాంగ్రెస్ పార్టీలో సిక్కుమతంపై ద్వేషం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. ప్రధానమంత్రి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రధాని ప్రసంగం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. గురువారం ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన ప్రసంగంలో పనికొచ్చే అంశం ఒక్కటి కూడా లేదని విమర్శించారు.మోదీ 97 నిమిషాల పాటు ప్రసంగించారని కానీ ఏమాత్రం ఉపయోగం లేని ప్రసంగం అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం విషయంలో తాము చేసిన ప్రతిపాదనల్లో ఒక్క దానికి కూడా ఆయన స్పందించలేదని అన్నారు. ఆయన కేవలం 100 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అంటూ ఏదేదో మాట్లాడారని ఎద్దేవా చేశారు.ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసిన పుస్తకాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించగానే అధికార పార్టీ ఇబ్బంది పడిందని అన్నారు. సభలో అధికార పక్షం తమకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదని అన్నారు. లోక్ సభ, రాజ్యసభ ప్రజాస్వామ్యానికి రెండు స్థంభాలని, ఒక దానిలో ప్రతిపక్షాన్ని అణిచివేసి మరో సభలో మాట్లాడితే ఫలితం లేదని ఖర్గే అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa