ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 03:00 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తినకు వెళుతున్నారు. ఈ సాయంత్రం 7.20 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన ఢిల్లీకి బయల్దేరుతారు. రాత్రి 9.35 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రి 1-జన్ పథ్ నివాసంలో ఆయన బస చేస్తారు. రేపు ఉదయం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కీలక కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు.  పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ ఉన్న బకాయిల విడుదల, పోలవరం పునరావాస ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్మలా సీతారామన్ ను కోరనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన బ్యాంకు రుణాల ప్రక్రియ, కేంద్రం నుంచి అందాల్సిన వివిధ రకాల గ్రాంట్లపై చంద్రబాబు చర్చించనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa