AP: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రూరల్ మండలంలోని ఎరుకోపాడు గ్రామంలో సురగం శ్రీనివాసరావు అనే వ్యక్తి వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయం బయట చెబితే కుటుంబంతో సహా చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు తెలిపారు. గత బుధవారం భర్త, గ్రామపెద్దల సహకారంతో అయితే.. ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు తమకు సరైన న్యాయం జరగలేదని బాధితురాలు ఆవేదన చెందారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు తగిన న్యాయం చేయాలని భర్త డిమాండ్ చేశారు. తిరువూరు పోలీసులు చిన్నపాటి సెక్షన్లు మాత్రమే పెట్టి.. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై త్వరితగతిన దర్యాప్తు జరిపి, నిందితుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాధితులు డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa