ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కసారిగా పెరిగిన సిగరెట్ ధరలు..

national |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 07:23 PM

దేశంలో సిగరెట్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 1 నుంచి కేంద్ర బడ్జెట్‌లో పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ, సెస్‌లను పెంచడంతో ఈ ప్రభావం కనిపించింది. స్టెల్లార్ డిఫైన్‌ 20 సిగరెట్ల ప్యాక్‌ ధర రూ.280 నుంచి రూ.380కి పెరిగింది. గోల్డ్ స్మాల్‌ 10 సిగరెట్ల ధర రూ.95 నుంచి రూ.140కి చేరింది. రూ.10 సిగరెట్‌ ఇప్పుడు రూ.13 అయింది. పొగాకు వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ పన్నులు పెంచినట్లు కేంద్రం చెబుతోంది.సిగరెట్ తాగడం వల్ల తాగేవారికే కాదు… వారి చుట్టూ ఉన్నవారికి, ఆ పొగ పీల్చేవారికి కూడా చాలా హానికరం. అందుకే చాలామంది ధరల పెంపును స్వాగతించారు. అయితే ఈ ధరల పెంపు స్మగ్లింగ్, నకిలీ ఉత్పత్తులను ప్రోత్సహించవచ్చని పంపిణీదారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా సిగరెట్లను ఎంపిక చేసుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa