జంక్ ఫుడ్ కేవలం ఆహారం కాదు, ఒక ఫ్యాషన్‌గా మారింది. ఇది పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అధిక కేలరీలు, చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు ఉండే ఈ ఆహారాలు పోషకాహార లోపానికి దారితీస్తాయి. పిల్లల్లో ఏకాగ్రత లేకపోవడం, చిరాకు, నిద్రలేమి వంటి సమస్యలకు పేలవమైన ఆహారపు అలవాట్లు కారణమవుతున్నాయని వైద్యులు తెలిపారు. ఇంట్లో వండిన భోజనాన్ని ప్రోత్సహించడం, కుటుంబంతో కలిసి తినడం వంటి మార్గాల ద్వారా పిల్లలను ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వైపు మళ్లించవచ్చని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa