వైసీపీ అధినేత జగన్ మంగళవారం ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తప్పుడు లెక్కలతో ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. '2024-25లో రాష్ట్ర నామినల్ GSDP 11.75% వచ్చిందని చెప్పారు. రియల్ GSDPలో దేశంలోనే మూడో స్థానం దక్కిందన్నారు. అయితే CAGR ప్రకారం గవర్నమెంట్ రెవెన్యూ ట్యాక్స్ 1.97%(22వ ర్యాంక్) మాత్రమే రావడం ఆశ్చర్యానికి గురిచేసింది' అని ట్వీట్ చేశారు.ప్రభుత్వం చెబుతున్న వృద్ధి నిజమైతే, పన్నుల రాబడిలో కూడా అదే స్థాయి పెరుగుదల కనిపించాలని జగన్ అన్నారు. కానీ, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు విడుదల చేసిన లెక్కలు ప్రభుత్వ బూటకపు ప్రచారాన్ని బట్టబయలు చేశాయని తెలిపారు. గత రెండేళ్లలో రాష్ట్ర పన్నుల రాబడి వృద్ధి సగటున కేవలం 1.97 శాతంగా మాత్రమే ఉందని, ఇది దిగ్భ్రాంతికరమని అన్నారు. "11 శాతం పైగా జీఎస్‌డీపీ వృద్ధి సాధిస్తున్న రాష్ట్రంలో పన్నుల రాబడి 2 శాతం లోపు ఎలా ఉంటుంది? ఈ వింత గణాంకాలు చూసి ప్రపంచ ఆర్థికవేత్తలు కూడా ఆశ్చర్యపోతారు" అని జగన్ ఎద్దేవా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa