టీ20 వరల్డ్‌కప్ 2026లో కొందరు ఆటగాళ్లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. గతంలో ఒక దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కొందరు ప్లేయర్లు, ఇప్పుడు మరో దేశం జెర్సీతో బరిలోకి దిగడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వరల్డ్‌కప్‌లో షేహన్ జయసూర్య, జేజే స్మట్స్, టిమ్ డేవిడ్ , మార్క్ చాపమన్ రెండు దేశాల తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు. వీళ్లందరూ గతంలో వేరే దేశాలకు ప్రాతినిధ్యం వహించి, ఇప్పుడు కొత్త జట్ల తరఫున ఆడుతున్నారు.
శ్రీలంక తరఫున 30 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన షేహన్ జయసూర్య, ఇప్పుడు మరో జట్టుకు కీలక ఆటగాడిగా మారారు. అదే విధంగా దక్షిణాఫ్రికా తరఫున 22 మ్యాచ్‌లు ఆడిన జేజే స్మట్స్ కూడా కొత్త దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగారు. సింగపూర్ తరఫున 14 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన టిమ్ డేవిడ్, ఇప్పుడు మరింత బలమైన జట్టులో చోటు దక్కించుకుని తన ప్రతిభ చూపించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. హాంకాంగ్ తరఫున 21 మ్యాచ్‌లు ఆడిన మార్క్ చాప్‌మన్ కూడా ఇదే కోవలోకి వస్తారు.
ఈ మార్పులకు ప్రధాన కారణం ఐసీసీ అర్హత నిబంధనలు. ఒక దేశం తరఫున ఆడిన తర్వాత నిర్దిష్ట కాలం విరామం తీసుకుంటే, పౌరసత్వం లేదా నివాస అర్హత ఆధారంగా మరో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనల వల్లే ఇటీవలి కాలంలో ఇలాంటి మార్పులు ఎక్కువయ్యాయి. కొందరు ఆటగాళ్లు తమ కెరీర్ కొనసాగింపు కోసం, మరికొందరు మెరుగైన అవకాశాల కోసం జట్టు మార్చుకుంటున్నారు. ముఖ్యంగా పెద్ద జట్లలో చోటు దక్కని ప్లేయర్లు, చిన్న దేశాల జట్లలో కీలక పాత్ర పోషిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు.
టీ20 వరల్డ్‌కప్ 2026లో ఈ నలుగురు ఆటగాళ్లు తమ కొత్త జట్లకు ఎంతవరకు ఉపయోగపడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. షేహన్ జయసూర్య యూఎస్ఏ తరఫున ఆడుతుండగా.. జేజే స్మట్స్ నమీబియా, టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియా, మార్క్ ఛాప్‌మన్ న్యూజిలాండ్ తరఫున ఆడుతున్నారు. ఇలా ఒకే కెరీర్‌లో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించడం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త ట్రెండ్‌గా మారుతోంది. గతంలో కూడా చాలా మంది ప్లేయర్లు టీ20 వరల్డ్‌కప్ బరిలో నిలిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa