ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తగ్గిన బంగారం ధరలు

business |  Suryaa Desk  | Published : Thu, Feb 12, 2026, 12:00 PM

బంగారం ధర గురువారం భారీగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 1,200 తగ్గి రూ.1,58,400కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 తగ్గి రూ. 1,45,200వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.3లక్షలుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.గత నెలలో రికార్డ్ గరిష్ఠాలను తాకిన బంగారం, వెండి రేట్లు వెనక్కి దిగివచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మళ్లీ ఇప్పుడు వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఆల్ టైమ్ హై స్థాయి కన్నా దాదాపు రూ.20 వేల తక్కువగానే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొనుగోలు చేసేందుకు ఇది సరైన సమయంగా చెబుతున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులతో బంగారంలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరుగుతోందని, పసిడి రేట్లు మరింత పెరగుతాయని అంచనా వేస్తున్నారు. ఓవైపు బంగారం ధరలు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్న తరుణంలో వెండి స్వల్ప ఊరట కల్పించింది. వరుసగా రెండో రోజూ ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.3,00,000 మార్క్ వద్దే స్థిరంగా ట్రేడవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa