ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెద్ద మనస్సు చాటుకున్న మాజీ మంత్రి ఆర్‌కే రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 18, 2026, 02:17 PM

చిత్తూరు జిల్లా, నగరి పట్టణానికి చెందిన ఓ కుటుంబం పూరియాత్రలో భాగంగా జగన్నాథ దేవాలయం దర్శనానికి వెళ్లిన సమయంలో తమ బ్యాగులు పొగొట్టుకున్నారు. ఫోన్లు, డబ్బులు అన్నీ బ్యాగులోనే ఉండడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. తీవ్ర ఆవేదనకు గురై కన్నీటిపర్యంతమయ్యారు. అయితే ఆ సమయంలో అక్కడికి వచ్చిన తెలుగు తెలిసిన ఓ మీడియా మిత్రుడు వారిని గుర్తించి మాట్లాడారు., తమ దుర్దశను వివరించారు. నగరి ప్రాంతానికి చెందిన వారని తెలియడంతో తమ ప్రతినిధుల ద్వారా ఈ విషయాన్ని మాజీ మంత్రి ఆర్‌కే రోజా దృష్టికి తీసుకెళ్లారు.  విషయాన్ని తెలుసుకున్న ఆమె వెంటనే స్పందించి, పూరిలో చిక్కుకున్న ఆరుగురు సభ్యులున్న ఆ కుటుంబాన్ని సురక్షితంగా నగరికి చేరుకునేందుకు అవసరమైన ప్రయాణ ఖర్చులను సమకూర్చారు. అంతేకాకుండా, వారు తిరిగి స్వగ్రామానికి చేరుకునే వరకు భోజన ఖర్చులకు కూడా అదనపు డబ్బు లు అందించి ఆదుకున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa