ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఐ వల్ల భవిష్యత్తులో అనేక ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది : వెంకయ్యనాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 01:52 PM

కృత్రిమ మేథస్సు (ఏఐ) ప్రభావంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ వల్ల భవిష్యత్తులో అనేక ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని అన్నారు. మానవ సంబంధాలు దెబ్బతినకూడదని, విలువలతో కూడిన సాంకేతికత అవసరమని సూచించారు. విజయవాడలో జరిగిన పూర్వవిద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సంబరాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, వైట్‌కాలర్ ఉద్యోగాలు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగు భాష, సంస్కృతిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.అంతర్జాతీయ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్వీకులు మనకు అందించిన సంప్రదాయాలను మనం మన భావితరాలకు అందించాలని విద్యార్థులకు సూచించారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని , మన కట్టు.. బొట్టులకు ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. కులం కన్నా గుణం మిన్న అని పెద్దలు ఊరికే చెప్పలేదని, డిగ్రీల కంటే పరిజ్ఞానమే ముఖ్యమన్నారు. ఇక రాజకీయాల్లో బూతులు మాట్లాడే వ్యక్తుల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదన్నారు. అలాంటివారిని సమాజం బహిష్కరించాలని హితవుపలికారు. తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని, గూగుల్, రీల్స్ కు ప్రాధాన్యం తగ్గించి మంచి సమాజ నిర్మాణానికై మనమంతా కృషి చేయాలని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa