ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తగనున్న వంటనూనె ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 01:32 PM

దేశంలో వంటనూనెల ధరలు రూ.150 దాటడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ముడి వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుండి 10 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు మే 31వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో వంటనూనె ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. భారతదేశం తన వంటనూనె అవసరాలలో 70 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. పామాయిల్ ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా నుండి, సన్‌ఫ్లవర్ నూనె ఉక్రెయిన్, రష్యా, అర్జెంటీనా, బ్రెజిల్ నుండి దిగుమతి అవుతున్నాయి. దిగుమతి సుంకం తగ్గడంతో మొత్తం పన్ను భారం 27.5 శాతం నుండి 16.5 శాతానికి తగ్గుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa