హిందూ మతాన్ని పరిరక్షిస్తామంటూనే తమ చర్యలతో కూటమి నాయకులు అడుగడుగునా హిందూ సాంప్రదాయాలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు అని వైసీపీ మహిళా నేత వరుదు కళ్యాణి అభిప్రాయపడ్డారు. ఆమె మాట్లాడుతూ... మాజీ సీఎం వైయస్ జగన్ గారు కడపలోని వేంపల్లెలో నందీశ్వర ఆలయాన్ని ప్రారంభిస్తే దానిపైనే ఫేక్ వీడియాలతో తెలుగుదేశం సోషల్ మీడియా విషం కక్కింది. టీడీపీ అంటేనే టెంపుల్ డిమాలిషన్ పార్టీ అని అర్థం. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా విజయవాడలో పుష్కరాల పేరుతో 40కి పైగా ఆలయాలను కూల్చేస్తే, వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక వాటిని నిర్మించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తిరుమలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చివేశారు. ముఖ్యమంత్రులుగా ఉండి తిరుమల ప్రతిష్టను, స్వామి వారి వైభవాన్ని పెంచిన ఘనత తండ్రీకొడుకులు దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు, మాజీ సీఎం వైయస్ జగన్లకే దక్కుతుంది. వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 4,111 కొత్త ఆలయాల నిర్మాణాలు మొదలు పెట్టి ఒక్కదానికి రూ.10 లక్షలు కేటాయించడం జరిగింది. అందులో 80 శాతం పనులు రామాలయాలే. రూ. 411 కోట్లతో 801 పురాతన ఆలయాల ఆధునికీకరణ పనులు చేయడం జరిగింది. దుర్గ గుడి అభివృద్ధి కోసం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వ నిధులు రూ.70 కేటాయించిన ఘనత వైయస్ జగన్ గారికే దక్కుతుంది అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa