పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1:22-1:30 గంటల మధ్య భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైంది. భూకంప కేంద్రం బంగ్లాదేశ్‌లోని ఖుల్నాకు 26 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో ఉంది. ఈ ప్రకంపనల వల్ల కోల్‌కతా, పరిసర ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్‌లోని ఇతర జిల్లాలు కూడా బలంగా కంపించాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎలాంటి గాయాలు లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa