ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ వైమానిక దాడులు.. 274 మంది తాలిబన్లు మృతి!

international |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 10:42 AM

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. పాక్ సైన్యం 'ఆపరేషన్ గజబ్ లిల్ హక్' పేరుతో ఆఫ్ఘన్ ప్రజలపై వైమానిక దాడులు ప్రారంభించింది. కాబూల్, కాందహార్, పాక్తియా ప్రాంతాలపై జరిగిన ఈ దాడుల్లో కనీసం 274 మంది తాలిబన్లు మరణించినట్లు తెలుస్తోంది. ఇటీవల డ్యురాండ్ లైన్ వద్ద ఆఫ్ఘన్ దళాల కాల్పుల్లో 55 మంది పాక్ సైనికులు మరణించినట్లు పాకిస్తాన్ రక్షణశాఖ తెలిపింది. ఈ పరిణామాలపై చైనా, రష్యా ఆందోళన వ్యక్తం చేశాయి. వివాదాలను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని, సంయమనం పాటించాలని ఇరుదేశాలకు సూచించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa