ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలుషిత నీరు, కల్తీ పాలు, అక్రమ మద్యం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి ఉందా ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 12:32 PM

రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న డయేరియా, కల్తీ పాలు ఘటనలపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, “ప్రజలు బ్రతకడానికి తాగే పాలు, నీళ్లు కూడా సురక్షితం కాకపోవడం దారుణం. కలుషిత నీరు, కల్తీ పాలు కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకం” అని పేర్కొన్నారు.ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ స్పందిస్తూ... ఎవరైనా బ్రతకడం కోసం పాలు, నీళ్లు తాగుతారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ రెండూ ప్రాణాంతకం అవుతున్నాయి. పలు చోట్ల కల్తీ పాలు, కలుషిత నీరు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యవసరమైన ఆ రెండింటి పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నమైంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబునాయుడు పాలనలో డయేరియా, ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు తరుచూ వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థకు ఆ ఘటనలు అద్దం పడుతున్నాయి. పరిపాలనపై చంద్రబాబు పూర్తిగా తన పట్టు కోల్పోగా, మిగిలిన వారంతా ప్రతిపక్షంపై బురద చల్లడం, నిత్యం అసత్య ప్రచారం చేయడంతో పాటు, రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కడికక్కడ స్వార్థ ప్రయోజనాలు ఆశించి పని చేస్తూ.. ప్రజారోగ్యం, వారి రక్షణ వంటి వాటికి పూర్తిగా మంగళం పాడుతున్నారు.కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 16 మంది విద్యార్థినులు డయేరియాతో అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. ఇదే పాఠశాలలో గతంలో కలుషిత నీటి కారణంగా పచ్చకామెర్లతో ఇద్దరు బాలికలు మృతి చెందగా, దాదాపు 100 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. అంత దారుణంగా ఘటనలు చోటు చేసుకున్నా, సమస్య శాశ్వత పరిష్కార దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు ఆ విధంగా వ్యవస్థ దారుణంగా విఫలం కాగా, మళ్లీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉత్పన్నమైంది అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa