ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ యూజర్లకు .. ఇక 4జీ కూడా అన్‌లిమిటెడ్

business |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 10:54 PM

ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం అందిస్తున్న అన్‌లిమిటెడ్ 5జీతో పాటు 4జీ డేటా సర్వీసులను సైతం అన్‌లిమిటెడ్‌గా అందిస్తామని తెలిపింది. ఈ మేరకు వ్యక్తిగత, ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్లను అప్‌డేట్ చేసినట్లు తెలిపింది. దీనిపై అధికారికంగా కంపెనీ ప్రకటన చేయనప్పటికీ వెబ్‌సైట్లో ఆ మేరకు మార్పులు చేసింది. మొదట 10 సర్కిళ్లలో ప్రయోగాత్మకంగా అన్‌లిమిటెడ్ సర్వీసులు ప్రారంభించిన ఎయిర్ టెల్ దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో ఈ సేవలను తీసుకొచ్చినట్లు తెలిపింది. అన్‌లిమిటెడ్ అంటే 300 జీబీ వరకు హైస్పీడ్ డేటాను యూజర్లు పొందవచ్చని తెలిపింది.


అప్‌డేట్ చేసిన ప్లాన్ల ప్రకారం నెలకు రూ.449 వ్యక్తిగత ప్లాన్ ద్వారా 1 సిమ్ (ప్రైమరీ), అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ 4జీ, 4జీ డేటా (300 జీబీ వరకు), ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లై, జియో హాట్ స్టార్ (3 నెలలు) వంటివి వస్తాయి. ఇక రూ.549 ప్లాన్ ద్వారా 1 సిమ్, అన్‌లిమిటెడ్ కాల్స్ ప్లస్ ఎస్ఎంఎస్, డేటాతో పాటు అదనంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 12 నెలలు, అమెజాన్ ప్రైమ్ 6 నెలలు వంటి ఓటీటీ బెనిఫిట్స్ సైతం వస్తాయి.


రూ. 699 ప్లాన్ ద్వారా రెండు సిమ్ కార్డులు (1 ప్రైమరీ ప్లస్ మరొకటి అదనపు సిమ్) లభిస్తాయి. ఇద్దరు వ్యక్తులు అన్‌లిమిటెడ్ 4జీ, 5జీ సేవలు పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్, ఓటీటీ బెనిఫిట్స్ కూడా వస్తాయి. చిన్న కుటుంబాలకు రూ. 999 ప్లాన్ (1 ప్లస్ 2), రూ. 1199, రూ. 1399 (1 ప్రైమరీ ప్లస్ 3 సిమ్ కార్డులు) ప్లాన్లను కూడా తీసుకువచ్చింది. ఈ ప్లాన్లతో ఓటీటీ ప్రయోజనాలతో పాటు యాపిల్ టీవీ, యాపిల్ మ్యూజిక్ సైతం వస్తుంది. నెలకు రూ. 1749తో ఐదుగురు కుటుంబ సభ్యులకు సరిపోయేలా మరో ప్రీమియం ప్లాన్ కూడా ఇస్తోంది. ఇందులో 5 సిమ్ కార్డులు వస్తాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa