AP: YCP మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉగాది తర్వాత లోకేష్ సీఎం అయ్యే అవకాశం ఉందని, ఈ అంశాన్ని చంద్రబాబు, పవన్ కలసి చర్చించుకున్నారని తెలిపారు. తన కుమారుడితో కలిసి పని చేయాలని చంద్రబాబు పవన్‌ను కోరారని, ఇద్దరం ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుందని పవన్‌కు చెప్పారని పేర్ని నాని పేర్కొన్నారు. ఈ సమాచారం తనకు కేంద్ర నిఘా వర్గాల ద్వారా తెలిసిందని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa