Iran War : ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. భారతదేశంపైనా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే చమురు సరఫరా విషయంలో పెద్ద సమస్యలు లేకపోయినా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నాయి.ప్రత్యేకంగా భారతదేశంలో పండించే బాస్మతి బియ్యం ఎగుమతులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఆంక్షలు విధించడం, కొన్ని నౌకలు నిలిచిపోవడం వల్ల రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. దీంతో బాస్మతి బియ్యం విదేశాలకు పంపడం సాధ్యం కావడం లేదు.వ్యాపార వర్గాల అంచనా ప్రకారం సుమారు 4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతులు ఆగిపోయాయి. ఇందులో కొంత సరుకు నౌకల్లోనే నిలిచిపోగా, మరికొంత పోర్టులు మరియు గోడౌన్లలో నిల్వగా ఉంది. ఈ పరిస్థితి కారణంగా రైతులు, మిల్లర్లు, వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బాస్మతి బియ్యం ఎగుమతుల్లో భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. మన దేశం నుంచి ఎక్కువగా ఈ బియ్యం ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ వంటి గల్ఫ్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్తుంది. మొత్తం ఎగుమతుల్లో దాదాపు 50 శాతం ఈ దేశాలకే సాగుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.అంతర్జాతీయ రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్లో బాస్మతి బియ్యం ధరలు పడిపోతున్నాయి. ఒక క్వింటాల్‌కు సగటున రూ.1,000 వరకు ధర తగ్గినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.ఇక బాస్మతితో పాటు ఇతర ఉత్పత్తుల ఎగుమతులపైనా ఇదే పరిస్థితి నెలకొంది. మధ్యప్రదేశ్‌లో పండే అరుదైన బర్వాని రకం అరటిపండ్లు కూడా విదేశాలకు వెళ్లడం ఆగిపోయింది. ఈ సంక్షోభం తొందరగా తగ్గితే మళ్లీ ఎగుమతులు సాధారణ స్థితికి వస్తాయని రైతులు, వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa