Vivo T5x 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Vivo భారత మార్కెట్లో త్వరలో విడుదల చేయబోయే కొత్త స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక వివరాలను వెల్లడించింది. బడ్జెట్ సెగ్మెంట్లో మంచి గుర్తింపు పొందిన T సిరీస్‌లో భాగంగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ఫోన్ లాంచ్ ప్రకటనతో పాటు ఇందులో ఉండబోయే ఒక ముఖ్యమైన ఫీచర్‌ను కూడా కంపెనీ టీజ్ చేసింది.అయితే Vivo T5x 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో ఎప్పుడు విడుదల అవుతుందనే విషయాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం “Coming Soon” స్టేటస్‌తో మాత్రమే ఈ ఫోన్‌ను టీజ్ చేస్తోంది. త్వరలోనే లాంచ్ డేట్‌ను వెల్లడిస్తామని కంపెనీ తెలిపింది. ఇదిలా ఉండగా, ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను Flipkartలో విడుదల చేశారు. ఆ టీజర్ పోస్టర్లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కూడా చూపించారు.కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ 10 లక్షలకు పైగా AnTuTu స్కోర్ అందించే శక్తివంతమైన చిప్సెట్తో లాంచ్ కానుంది. అయితే ఆ ప్రాసెసర్ పేరు మాత్రం ఇంకా వెల్లడించలేదు. అలాగే ఈ ఫోన్ లేటెస్ట్ Origin OSతో పాటు తాజా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేయనుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం అధికారికంగా వెల్లడించిన వివరాలు ఇవే అయినప్పటికీ, ఈ ఫోన్‌కు సంబంధించిన మరికొన్ని స్పెసిఫికేషన్లు ఇప్పటికే ఆన్లైన్లో లీక్స్ రూపంలో వెలువడుతున్నాయి.లీక్ అయిన సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.72 అంగుళాల FHD+ LCD డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. అలాగే ఇందులో MediaTek Dimensity 7300 లేదా MediaTek Dimensity 7400 సిరీస్ ప్రాసెసర్‌ను ఉపయోగించే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన కెమెరా సెటప్ మరియు పెద్ద సామర్థ్యం గల బ్యాటరీ కూడా ఈ ఫోన్లో ఉండే అవకాశముందని సమాచారం.ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మరియు అధికారిక లాంచ్ డేట్‌ను Vivo త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అప్పటివరకు లీక్స్‌లో వినిపిస్తున్న ఫీచర్లలో ఎన్ని నిజమవుతాయో వేచి చూడాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa