ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో జలవనరుల శాఖ లస్కర్ల వేతనాల పెంపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2026, 10:10 AM

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖలో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న లస్కర్లకు శుభవార్త చెప్పింది. వారి రోజువారీ వేతనాలను గణనీయంగా పెంచుతూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వారి వేతనం రూ. 350 నుంచి రూ. 550కి పెరగనుంది.లస్కర్లు చాలాకాలంగా తమ వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వారి వినతిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, వేతనాల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు జలవనరుల శాఖ పరిధిలోని సీఏడీఏ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. పెంచిన వేతనాలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ స్పష్టం చేశారు.ఈ వేతనాల పెంపుతో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రోత్సాహం అందించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను వెంటనే అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa