మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతున్నాయి. యుద్ధం లేదా రాజకీయ అనిశ్చితి పెరిగిన సందర్భాల్లో పెట్టుబడిదారులు సాధారణంగా సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం చూస్తాం.దాంతో బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు ఇటీవల గణనీయంగా పెరిగాయి. ఈ పెరుగుదల కారణంగా బంగారం, వెండి ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) కూడా మంచి లాభాలను చూపుతున్నాయి. కొన్ని ETFల విలువ కొద్ది రోజులలోనే 5–10 శాతం పెరగడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.సాధారణంగా యుద్ధ పరిస్థితులు లేదా ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతాయి. అలాంటి సందర్భాల్లో పెట్టుబడిదారులు తమ పెట్టుబడిని రక్షించడానికి బంగారం, వెండి వంటి “సేఫ్ హావెన్” ఆస్తుల వైపు రుణం చూపుతారు. దాంతో వాటి డిమాండ్ పెరిగి ధరలు కూడా ఎగసిపడతాయి. ఈ ప్రభావం ETFలలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ETFలు బంగారం లేదా వెండి ధరల నేరుగా అనుసరించే పెట్టుబడిదారుల సాధనాలు. అంతర్జాతీయ మార్కెట్లో లోహాల ధరలు పెరిగితే, వాటి ETFల నికర ఆస్తి విలువ (NAV) కూడా పెరుగుతుంది.ఇటీవలి డేటా ప్రకారం వెండి ETFలు మంచి లాభాలను సాధించాయి. ఉదాహరణకు, UTI సిల్వర్ ETF సుమారు 10.87 శాతం, టాటా సిల్వర్ ETF 10.80 శాతం, DSP సిల్వర్ ETF సుమారు 8.81 శాతం పెరిగాయి. వెండి ధరలు సాధారణంగా బంగారం కంటే వేగంగా మారడం వల్ల ETFల లాభాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో గోల్డ్ ETFలు కూడా స్థిరమైన వృద్ధిని చూపాయి. క్వాంటమ్ గోల్డ్ ఫండ్ ETF సుమారు 5.31 శాతం, HDFC గోల్డ్ ETF మరియు కోటక్ గోల్డ్ ETF సుమారు 5.29 శాతం పెరిగాయి.నిపుణుల సూచన ప్రకారం, తక్షణ లాభాల కోసం కాకుండా దీర్ఘకాల పెట్టుబడికి గోల్డ్ ETFలు స్థిరమైన ఎంపికగా పరిగణించవచ్చు. అయితే, మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ దశలవారీగా పెట్టుబడి పెట్టడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa