ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 15, 2026, 08:20 PM

మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పట్టుబడటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న ఆయన, పార్టీ కార్యకలాపాలకు తక్షణమే దూరంగా ఉండాలని పుట్టా మహేశ్‌ను ఆదేశించారు.ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు పుట్టా మహేశ్ నుంచి వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే, డ్రగ్స్ కేసులో పుట్టా పట్టుబడిన వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని కూడా పల్లాను ఆదేశించారు.వ్యక్తుల బలహీనతలు, వ్యక్తిగత తప్పిదాల వల్ల పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. డ్రగ్స్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎవరైనా సరే, ఉపేక్షించే ప్రసక్తే లేదని పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఆయన ఉద్ఘాటించారు. ఈ ఘటనపై పార్టీపరంగా కఠిన చర్యలు ఉంటాయనే సంకేతాలను ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa