ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు: అమరజీవి త్యాగం - యువతకు స్ఫూర్తి: కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 16, 2026, 02:35 PM

కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మాట్లాడుతూ, అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మార్చి 16, 1901న జన్మించిన పొట్టి శ్రీరాములు, మద్రాసులో ప్రాథమిక విద్యను అభ్యసించారని, తెలుగు ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa