ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పడిపోయిన ఉల్లి ధరలు.........కేజీ ఎంతంటే?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 06, 2026, 02:49 PM

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయల ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా ఎగుమతులు నిలిచిపోవడంతో సరఫరా పెరిగి ధరలు తగ్గాయి. ప్రస్తుతం రూ.100కు 8 కిలోల వరకు ఉల్లిపాయలు లభిస్తున్నాయి. నెల క్రితం క్వింటా రూ.2,000 ఉన్న ధరలు ఇప్పుడు రూ.800–1400కు పడిపోయాయి. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. గల్ప్ దేశాల్లో యుద్ద పరిస్థితుల క్రమంలో ఇక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. దీని వల్ల సరఫరా పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో గిట్టుపాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు. పంటకు మద్దతు ధర లేక తెలుగు రాష్ట్రాల్లో రైతులు లబోదిబోమంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa