Sunrisers Hyderabad అభిమానులకు భారీ ఊరట లభించింది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ Pat Cummins త్వరలోనే మైదానంలోకి తిరిగి రానున్నట్లు సమాచారం.ఏప్రిల్ 25న Rajasthan Royalsతో జరిగే మ్యాచ్‌కు తాను అందుబాటులో ఉంటానని ప్యాట్ కమిన్స్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరమైన కమిన్స్ తిరిగి రావడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో కమిన్స్ రీఎంట్రీ కోసం అభిమానులు సోషల్ మీడియాలో నిరంతరం పోస్టులు పెడుతున్నారు. ఏప్రిల్ 18న Chennai Super Kingsతో జరిగే మ్యాచ్‌కే అతను తిరిగి రావాలని ఒక అభిమాని కోరగా, దానికి కమిన్స్ స్పందించారు. ఆ మ్యాచ్‌కు తాను అందుబాటులో ఉండనని, కానీ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో మాత్రం తప్పకుండా ఆడతానని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa