ప్రముఖ యూకే ఎలక్ట్రానిక్స్ కంపెనీ Nothing కు చెందిన ఉప బ్రాండ్ CMF తన కొత్త స్మార్ట్‌వాచ్‌ను అధికారికంగా ప్రకటించింది. అదే CMF Watch 3 Pro. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో ఈ వాచ్‌ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.Nothing బ్రాండ్‌తో పోలిస్తే CMF ఉత్పత్తులు ఎక్కువగా బడ్జెట్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడతాయి. అందుకే ఈ కొత్త స్మార్ట్‌వాచ్‌పై వినియోగదారుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.
*CMF Watch 3 Pro: లాంచ్ డేట్ ఈ స్మార్ట్‌వాచ్ ఇండియా విడుదల తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే లీక్‌లు మరియు టీజర్ సమాచారం ప్రకారం, ఈ నెల చివర్లో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. Flipkartలో ఇప్పటికే ప్రత్యేక టీజర్ పేజీ కూడా కనిపిస్తోంది.
*CMF Watch 3 Pro: ఫీచర్స్ ఈ వాచ్ ఆకర్షణీయమైన రౌండ్ డయల్ డిజైన్‌తో వస్తుంది. మెటల్ ఫ్రేమ్, సిలికాన్ స్ట్రాప్స్‌తో ప్రీమియం లుక్‌ను అందిస్తుంది.ఇందులో 1.43 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది, ఇది 60FPS రిఫ్రెష్ రేట్‌తో పని చేస్తుంది. ఆటో బ్రైట్నెస్ సపోర్ట్‌తో పాటు 91% స్క్రీన్-టు-బాడీ రేషియో కూడా ఉంది. వినియోగదారులు 120 కస్టమ్ వాచ్ ఫేసెస్‌ను ఉపయోగించుకోవచ్చు.హెల్త్ ఫీచర్ల విషయానికి వస్తే, అడ్వాన్స్‌డ్ హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 (బ్లడ్ ఆక్సిజన్), స్ట్రెస్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అదనంగా 131 స్పోర్ట్స్ మోడ్‌లు సపోర్ట్ చేస్తుంది.ఇక స్మార్ట్ ఫీచర్లలో AI న్యూస్ రిపోర్టర్, AI రికార్డింగ్ ట్రాన్స్‌క్రిప్షన్ వంటి ఆధునిక AI టూల్స్ అందుబాటులో ఉంటాయి. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో పాటు Nothing X యాప్‌తో పనిచేస్తుంది. అలాగే GPS ట్రాకింగ్ సదుపాయం కూడా ఉంటుంది.మొత్తానికి, బడ్జెట్ సెగ్మెంట్‌లో ప్రీమియం ఫీచర్లతో CMF Watch 3 Pro స్మార్ట్‌వాచ్ గట్టి పోటీ ఇవ్వనుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa