రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది ప్రత్యేక కోర్టులను మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. బాలలపై లైంగిక వేధింఫుల పోస్కో చట్టం కింద నమోదైన కేసులను త్వరితగతిన విచారణకు ఈ ప్రత్యేక కోర్టులు మంజూరు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో ఈ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, గుంటూరు జిల్లాలలో వందకు పైగా పోస్కో చట్టం కేసులు పెండింగ్ లో ఉండగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కోర్టులను ఏర్పాటు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa