ఇప్పటికే పలు వాణిజ్య ప్రకటనలపై వినియోగదారులు కోర్టును ఆశ్రయించగా.. తాజాగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన భారీ అందాల రాశీ, గ్లామర్ హీరోయిన్ రంభకు వినియోగదారుల ఫోరం కోర్టు షాకిచ్చింది. ఆ ఇద్దరు హీరోయిన్లు కలర్స్ అనే సంస్థలో చేసిన వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయొద్దని విజయవాడ వినియోగదారుల ఫోరం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే సదరు హీరోయిన్ల కలర్స్ వెయిట్ లాస్ ప్రకటనలు చూసి మోసపోయానని ఓ కస్టమర్ కోర్టును ఆశ్రయించాడు.. తాను ఇంత మొత్తం చెల్లించినా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. కలర్స్ సంస్థకు వినియోగదారుడు చెల్లించిన రూ.74,652ల మొత్తాన్ని 9 శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది.. అంతేకాదు.. వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.2 లక్షలను జరిమానాగా చెల్లించాలని పేర్కొంది. మరోవైపు రాశి, రంభలు ఉన్న ఆ ప్రకటనలను ఆపేయాలని తీర్పు వెలువరించింది. రాశీ, రంభ లాంటి హీరోయిన్లో ఇలాంటి తప్పుడు ప్రకటనలను ప్రోత్సహించడం సరికాదని మొట్టికాయలు వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa