ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీపుపై చంద్రయాన్-2ను టాటూ

national |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2019, 08:44 AM

నవరాత్రి వేడుకల్లో గర్భా నృత్యంలో పాల్గొనడానికి గుజరాతీ యువతులు వినూత్నంగా సిద్ధమైపోతున్నారు. మెరిసిపోయే దుస్తులతో.. వినూత్నమైన టాటూలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు యువతులు. ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలను సూరత్ అమ్మాయిలు సరికొత్త పద్ధతిలో సెలబ్రేట్ చేస్తున్నారు. కొంతమంది యువతులు.. తమ శరీరంపై సామాజిక బాధ్యతగా ఆలోచించే టాటూలను వేయించుకున్నారు. దర్శిని అనే అమ్మాయి తన వీపుపై చంద్రయాన్-2ను పోలిన టాటూను, మరో యువతి పాయల్ దని ఆర్టికల్ 370, 35ఏ టాటూను, ఇంకో అమ్మాయి ట్రాఫిక్ రూల్స్‌ను ఫాలో కావాలని చూపించే టాటూలను వేయించుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేసినా తప్పు లేదని ఆ యువతులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa