లారీలో అక్రమంగా తరలిస్తున్న 90 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన గురువారం చిత్తూరులో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు వాహనాల తనిఖీలు చేస్తుండగా.. ఎపి27యు9257 నెంబరు ఉన్న లారీని శ్రీ సిటీ సబ్ ఇన్‌స్పెక్టర్లు సుబ్బా రెడ్డి, మధు, పోలీస్ బఅందం వెంబడించారు. లారీని అదుపులోకి తీసుకొని దాదాపు 90 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.