హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బారాలా తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల పోలింగ్ ఫలితాలు నేడు వెల్లడయ్యాయి. అధికార కైవసానికి మెజార్టీ బెంచ్‌మార్క్ 46 స్థానాలను సైతం బీజేపీ దక్కించుకోలేదు. ఈ నేపథ్యంలో ఫలితాల్లో పార్టీ వెనుకంజకు బాధ్యత వహిస్తూ అధ్యక్ష స్థానానికి రాజీనామా ప్రకటించారు. తాను పోటీ చేసిన తోహనా అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం సుభాష్ బారాలా ఓడిపోయారు. ఈ స్థానంలో జేజేపీ(జననాయక్ జనతా పార్టీ) చీఫ్ దుశ్యంత్ చౌతాలా గెలుపొందారు. ఫలితాలపై చర్చించేందుకు సీఎం మనోహర్‌లాల్ కట్టర్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఢిల్లీకి పిలిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa