సంక్రాంతి పండుగకు కొన్ని గంటల ముందు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ కొన్ని రకాల మద్యం బాటిళ్ల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.కొన్ని రకాల మద్యం బాటిళ్లపై రూ.10 ధర పెంచుతూ నిన్న ఉత్తర్వులు విడుదల చేసింది. అన్ని సైజుల బాటిళ్లపై ఈ ధర పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే రూ.99 (180 ఎంఎల్) ధర ఉన్న ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్, బీర్, వైన్, ఆర్‌టీడీలను ఈ పెంపు నుంచి మినహాయించినట్లు తెలిపింది.అదే విధంగా బార్లపై విధిస్తున్న అదనపు ఏఆర్‌ఈటీని తొలగించేందుకు అంగీకరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. బార్లు, షాపుల మధ్య ధరల సమానత్వం తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. రిటైలర్ మార్జిన్‌ను సుమారు ఒక శాతం పెంచుతున్నట్లు కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa