పరమహంస పరివ్రాజకులు శ్రీ తీదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారిని శుక్రవారం సీతానగరం ఆశ్రమంలో ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారు మంత్రిని మంగళ శాసనంతో ఆశీర్వదించి సన్మానించారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి, భక్తులకు అందించవలసిన సౌకర్యాలు, సేవలపైన స్వామి వారు మంత్రికి పలు సూచనలు చేశారు. ఈ సూచనలు తక్షణమే అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆదర్శ దిన చర్య 2020 పుస్తకమును స్వామి వారి సమక్షంలో మంత్రి ఆవిష్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa