ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ‘ఆక్స్‌ఫర్డ్’ యూనివర్శిటీలో చప్పట్లు కొట్టడాన్ని నిషేదించారు. అదేంటీ.. చప్పట్లు నిషేదిస్తే అభినందనలు వ్యక్తం చేయడం ఎలా? అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకుంటున్నారా? పూర్తి వివరాల ప్రకారం.....చప్పట్లు కొట్టడం వల్ల శబ్దం వస్తుందనే సంగతి తెలిసిందే. అయితే, ఇకపై ఆ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో శబ్దం వచ్చేలా చప్పట్లు కొట్టకూడదని ప్రకటించారు. ఈ రూల్‌ను ముందుగా స్టూడెంట్ యూనియన్ కార్యక్రమాల్లో అమలు చేస్తారు. అది విజయవంతమైతే మిగతా సొసైటీలకు, కార్యక్రమాలకు ఈ నిబంధనను వర్తింపజేస్తారు. ఎందుకు రద్దు చేశారు?: బ్రిటీష్ సాంప్రదాయం ప్రకారం.. ఎవరినైనా అభినందించాలంటే శబ్దం రాకుండా గాల్లోనే చేతులు ఆడిస్తారు. దీన్నే ‘జాజ్ హ్యాండ్స్’ అని అంటారు. నాటి సాంప్రదాయాన్ని ప్రోత్సహించడం కోసం యూనివర్శిటీ ఈ నిబంధన అమల్లోకి తెచ్చింది. శబ్దం రాకుండా చప్పట్లు కొడితే ఎలాంటి అభ్యంతరం ఉండదని పేర్కొంది. చప్పట్ల వల్ల ఆరాటం (Anxiety) వంటి సమస్యలు వస్తాయని, ఈ నిషేదం వల్ల ఆ సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుందని తెలపడం గమనార్హం. అయితే, ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa