ట్రెండింగ్
Epaper    English    தமிழ்

28 అక్టోబరు, 2019 రాశి ఫలాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 28, 2019, 01:13 AM

 28 అక్టోబరు, 2019 రాశి ఫలాలు 


మేష రాశి   – ఈ రోజు మీ పెద్దల నుంచి మీకు ఆశీర్వాదాలు అందుతాయి. వాటిని ఉపయోగించుకొని మీ బంధాలను మరింత బలపరుచుకోండి. ఇప్పటివరకు ముందుకు కదలని సమస్యలు కూడా తప్పకుండా పరిష్కారం దిశగా పయనిస్తాయి.


వృషభ రాశి    – ఈ రోజు మీ తల్లిదండ్రుల పట్ల మీకు ఎంతో ప్రేమాభిమానాలు ఉండవచ్చు. ఒకవేళ వారితో మీకేమైనా భేదాభిప్రాయాలు ఉన్నా లేక తగాదాలు ఉన్నా వాటిని ఇప్పుడు పరిష్కరించుకోండి. వారు కూడా మీకు సహకరిస్తారు. 


మిథున రాశి   – ఈ రోజు మీలో కొందరు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుండవచ్చు. లేదా ఉద్యోగ భద్రత లేని కారణంగా బాధపడుతుండవచ్చు. కానీ మీ కోరికలను ఒక జాబితాగా రాసుకోండి. త్వరలో అవన్నీ తీరుతాయి.


కర్కాటక రాశి  – ఈ రోజు ప్రస్తుతం మీ శారీరక ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సిన సమయం ఇది. అలాగే మీ మానసిక ఆరోగ్యం కూడా జాగ్రత్తగా సంరక్షించుకోండి. దేని గురించీ అతిగా ఆలోచించకండి.


సింహ రాశి   – ఈ రోజు ఇప్పుడు మీకు ప్రేమ చాలా అవసరం. అలాగే కుటుంబ సభ్యుల సహాయం, సహకారం కూడా ముఖ్యమ. కాబట్టి ముందు మీరు వారి గురించి ఆలోచించండి. వారి మాటలు, ప్రేమ మీకు సంతోషాన్నిస్తాయి.


క‌న్య రాశి  – ఈ రోజు మీరు బాగా సెన్సిటివ్ గా ఉన్న కారణంగానే ఇతరుల పట్ల ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారు. అయితే ఇది హద్దుల్లో ఉంటేనే మంచిది. అతిగా సెన్సిటివ్ గా ఉన్నా మీకు మంచిది కాదని గ్రహించండి.


తుల రాశి – ఈ రోజు మిమ్మల్ని ఏదో ఒక సమస్య బాగా ఇబ్బందిపెడుతోంది. దాని గురించి మీరు ఇతరులతో కూడా పంచుకోవట్లేదు. కాబట్టి మీ సమస్యను ఒక పేపర్ పై రాసి ఆ భగవంతుణ్ని సహాయం కోరుతున్నట్లు రాయండి. తప్పక ఫలితం కనిపిస్తుంది.


వృశ్చిక రాశి   – ఈ రోజు మీ మైండ్ లో ఏమనుకుంటే దానిని మీరు సాధించగలరు. మీ తెలివితేటలు, కష్టపడే తత్వం మీకు విజయాన్ని అందిస్తాయి. ప్రశంసలు అందేలా చేస్తాయి. మీరు ప్రేమించే వ్యక్తితో సమయం గడిపితే మరింత సంతోషంగా ఉంటారు.


ధనుస్సు రాశి   - ఈ రోజు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు పై నుంచి మీకు ఆశీర్వాదాలు పంపుతున్నారు. మీ చుట్టుపక్కల వారి ఉనికిని కూడా మీరు గమనించవచ్చు. వారు మీకు తప్పక సహకరిస్తారు.


మకర రాశి    – ఈ రోజు మీ మనసుకు అయిన గాయాన్ని మీకు మీరుగా మాన్పుకోగలరు. అందుకు ఇతరులు అందించే ప్రేమ, అభిమానాలే మీకు శక్తిని అందిస్తాయి. అయితే మీరు ఒకసారి ప్రేమిస్తే వారి నుంచి ఏమీ ఆశించకూడదని గుర్తుంచుకోండి.


కుంభ రాశి  -  ఈ రోజు మీ సమస్యలకు అనుకోకుండా మీకు పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు.. మీకు ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులను ఛాలెంజింగ్ గా తీసుకుని వాటి నుంచి బయటపడతారు. దేని గురించీ మీరు భయపడకండి.


మీన రాశి   – ఈ రోజు ఇంట్లో, పని ప్రదేశంలో.. ఎక్కడైనా సరే.. ఏ విషయం గురించైనా పాజిటివ్ గానే ఆలోచించండి. మిమ్మల్ని ముందుకు నడిపించే అవకాశాలు వాటంతటవే మీ ముందుకు వస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa