‘ద రైసింగ్ హిమాచల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్-2019’ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు హిమాచల్ ప్రదేశ్‌కి వచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతం ఘన స్వాగతం పలికారు. హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న యామి గౌతం, రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో తను భాగస్వామ్యం అయినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు, పారిశ్రామికంగా ఈ కార్యక్రమం మరో ముందడుగుగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని , రాష్ట్ర పౌరురాలిగా తనవంతు బాధ్యత నిర్వహిస్తున్నానని ఆమె తన ఇన్‌స్టాగ్రాంలో పేర్కొన్నారు.తన సొంత రాష్ట్రంలో జరుగుతున్న గొప్ప కార్యక్రమానికి ప్రధాని మోదీని, ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ను, పారిశ్రామిక శాఖ మంత్రి బిక్రం సింగ్‌ను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని రాసుకొస్తూ ఓ ఫోటోను షేర్ చేసిన యామీ గౌతం .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa