చిన్నారి వర్షిత హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య చేసిన నిందితుడి ఊహా చిత్రాన్ని మదనపల్లి పోలీసులు విడుదల చేశారు. చేనేత నగర్‌లో ఉన్న కల్యాణ మండపంలో బుధవారం రాత్రి జరిగిన ఓ పెళ్లికి చిన్నారి వర్షిత(6) కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాసేపటికి చిన్నారి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చిన్నారి మృతదేహం లభ్యమైంది. పెళ్లి జరిగిన ఫంక్షన్ హాల్‌కు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహం లభించిన విషయం తెలిసిందే
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa