ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ క్యాపిటల్స్ కి విండీస్ విధ్వంసక వీరుడు!

national |  Suryaa Desk  | Published : Thu, Dec 19, 2019, 07:05 PM

IPL 2020 వేలం మొదలైంది. ఒక్కో జట్టు ఒక్కో ఆటగాడిపై పట్టు బిగించి వేలంలో ఆటగాళ్లను సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో వెస్టిండీస్ విధ్వంసక హిట్టర్ సిమ్రాన్ హిట్‌మెయర్ భారీ ధరకి అమ్ముడుపోయాడు. రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన హిట్‌మెయర్ కోసం రాజస్థాన్ రాయల్స్‌తో ఆఖరి వరకూ పోరాడిన ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 7.75 కోట్లకి దక్కించుకుంది. ఇటీవల చెపాక్ వన్డేలో హిట్‌మెయర్ మెరుపు సెంచరీ బాదిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2020 వేలంలో తెలుగు క్రికెటర్లకి నిరాశ ఎదురైంది. రూ. 50 లక్షల కనీస ధరతో హనుమ విహారి వేలంలోకి‌రాగా అతడ్ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. అలానే ఆంధ్రా టీమ్ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకిరాగా.. అతడ్నీ ఫ్రాంఛైజీలు పట్టించుకోలేదు. దీంతో.. ఇద్దరూ అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో చేరిపోయారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ అనూహ్య నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సీనియర్, స్టార్ క్రికెటర్ల వేలం సమయంలో మిన్నకుండిపోయిన ఫ్రాంఛైజీ.. యువ క్రికెటర్లని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. భారత అండర్-19 కెప్టెన్ ప్రియమ్ గార్గె రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకిరాగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో పోటీపడి మరీ రూ. 1.9 కోట్లకి కొనుగోలు చేసింది. అలానే విరాట్ సింగ్‌‌‌ని కూడా రూ. 1.9 కోట్లకి దక్కించుకోవడం విశేషం. రూ. 14.60 కోట్లతో వేలంలోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఫ్రాంఛైజీ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. సీనియర్ స్పిన్నర్ పీయూస్ చావ్లా కోసం ఏకంగా రూ. 6.75 కోట్లు వెచ్చించింది. రూ. కోటి కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ స్పిన్నర్ కోసం ఆఖరి వరకూ అన్ని ఫ్రాంఛైజీలతోనూ చెన్నై పోటీపడింది. ఐపీఎల్‌లో ఇప్పటికే చావ్లా 150 వికెట్లు పడగొట్టాడు. వెస్డిండీస్ ఫాస్ట్ బౌలర్ కాట్రెల్ పంట పండింది. రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ పేసర్ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడగా.. ఆఖరికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 8.5 కోట్లకి దక్కించుకుంది. ఈ ఫాస్ట్ బౌలర్‌ తొలిసారి ఐపీఎల్‌లో ఆడబోతున్నాడు. వికెట్ తీసిన ప్రతిసారి సెల్యూట్ చేస్తూ సంబరాలు చేసుకుంటూ అభిమానుల్ని అలరిస్తుంటాడు. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ కావడంతో అతడికి కోసం ఫ్రాంఛైజీలు గట్టిగా పోటీపడ్డాయి. భారత ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్‌ని రూ. 3 కోట్లకే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ దక్కించుకుంది. రూ. కోటి కనీస ధరతో వేలంలోకి వచ్చిన జయదేవ్ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పోటీపడింది. కానీ.. ఆఖరిగా రూ. 3 కోట్లకి రాజస్థాన్ దక్కించుకుంది. 2018 ఐపీఎల్ వేలంలో జయదేవ్‌ని 11.5 కోట్లకి కొనుగోలు చేసిన రాజస్థాన్.. ఆ తర్వాత వేలంలోకి వదిలి మళ్లీ 2019 వేలంలో రూ.8.4 కోట్లకి దక్కించుకుంది. తాజాగా మళ్లీ వేలంలోకి వదిలి రూ. 3 కోట్లకే దక్కించుకోవడం విశేషం. ఆస్ట్రేలియా పర్యటనలో భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని బేబి సిట్టింగ్ అంటూ స్లెడ్జింగ్ చేసిన వికెట్ కీపర్ అలెక్స్ క్యారీని.. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2.4 కోట్లకి కొనుగోలు చేసింది. ఢిల్లీ టీమ్ వికెట్ కీపర్‌గా పంత్ ఉన్న విషయం తెలిసిందే. రూ.50 లక్షల కనీస ధరతో క్యారీ వేలంలోకి వచ్చాడు. ఐపీఎల్ 2020 సీజన్ వేలం ఫస్ట్ రౌండ్ ముగిసింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ అత్యధికంగా రూ. 15. 50 కోట్ల ధర పలకగా.. అతడ్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. ఇక ఆ దేశానికే చెందిన హిట్టర్ మాక్స్‌వెల్‌ని రూ. 10.75 కోట్లకి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. విధ్వంసక ఓపెనర్ అరోన్ ఫించ్‌ని రూ. 4.4 కోట్లకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకోగా.. భారత సీనియర్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప‌ని రూ. 3 కోట్లకి రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కమిన్స్‌ కోసం టోర్నీలోని ఫ్రాంఛైజీలు గట్టిగా పోటీపడ్డాయి. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన కమిన్స్‌‌ కోసం చివరి వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ పోటీపడగా.. ఆఖరిగా కోల్‌కతా రూ. 15.50 కోట్లకి దక్కించుకుంది. ఇంగ్లాండ్ యువ క్రికెటర్ సామ్ కుర్రాన్ రూ. కోటి ధరతో వేలంలోకి రాగా.. అతడి కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఆఖరిగా చెన్నై సూపర్ కింగ్స్ కుర్రాన్‌ని రూ. 5.50 కోట్లకి కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికా సీనియర్ ఆల్‌రౌండర్ క్రిస్‌ మోరీస్ రూ. 1.5 కోట్ల కనీస ధరతో వేలంలోకి రాగా.. అతడ్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ రూ. 10 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్ భారీ ధరకి అమ్ముడుపోయాడు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన మాక్స్‌వెల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఆఖరి వరకూ వెనక్కి తగ్గని పంజాబ్ రూ. 10.75 కోట్లకి అతడ్ని కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2019 సీజన్‌లో మాక్స్‌వెల్ ఆడలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ అరోన్ ఫించ్ చేరాడు. రూ. కోటి కనీస ధరతో వేలంలోకి వచ్చిన అరోన్ ఫించ్‌ని ఆఖరి వరకూ ఫ్రాంఛైజీలతో పోటీపడిన ఆర్సీబీ రూ. 4.4 కోట్లకి కొనుగోలు చేసింది. తెలుగు క్రికెటర్ హనుమ విహారి రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి రాగా.. అతడ్ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. అతనితో పాటు చతేశ్వర్ పుజారా కూడా అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. భారత సీనియర్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి రాగా.. అతడ్ని రూ. 3 కోట్లకి రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ రూ. 1.5 కోట్లు కనీస ధరతో వేలంలోకి రాగా.. అతడ్ని రూ. 5.25 కోట్లకి కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2020 సీజన్ వేలానికి రూ. 2 కోట్ల ధరతో ఆస్ట్రేలియా హిట్టర్ క్రిస్‌లిన్‌రాగా.. అతడ్ని ముంబయి ఇండియన్స్ అదే ధరకి కొనుగోలు చేసింది. రూ. 2 కోట్లు ప్రాథమిక ధరతోనే అతను వేలంలోకి వచ్చాడు. ఐపీఎల్ 2020 సీజన్‌కి సంబంధించి క్రికెటర్ల వేలం కోల్‌కతా వేదికగా ఈరోజు ఆరంభమైంది. ఈ వేలం కోసం మొత్తం 997 మంది క్రికెటర్లు తమ పేర్లని రిజస్టర్ చేసుకోగా.. జాబితాని బీసీసీఐ 332 మందికి కుదించింది. తాజాగా ఈరోజు మరో ఆరుగు క్రికెటర్లని కూడా ఈ జాబితాలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్‌లోని ఎనిమిది ఫ్రాంఛైజీలు కలిపి ఈ 338 మందిలో నుంచి కేవలం 73 మందిని మాత్రమే కొనుగోలు చేసే వెసులబాటు ఉంది. ఈ 73 మంది క్రికెటర్లలో 23 మంది విదేశీ క్రికెటర్లు ఉండనున్నారు. వేలానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హాజరయ్యాడు. భారత్ నుంచి ఈ వేలంలో రూ. 1.5 కోట్ల కనీస ధరతో రాబిన్ ఉతప్ప ఉండగా.. పీయూస్ చావ్లా, యూసఫ్ పఠాన్, జయదేవ్ ఉనద్కత్ రూ. కోటి ధరతో వేలంలోకి వస్తున్నారు. ఇక రూ. 50 లక్షల కనీస ధరతో చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, స్టువర్ బిన్నీ, నమన్ ఓజా, మోహిత్ శర్మ, సౌరభ్ తివారి, మనోజ్ తివారి, రిషి ధావన్, బరిందర్ శరణ్ తదితరులు ఉన్నారు. గత ఏడాది పుజారాని ఏ ఫ్రాంఛైజీ వేలంలోకి కోనుగోలు చేయలేదు. ఇక రూ. 2 కోట్ల కనీస ధరతో మాక్స్‌వెల్, క్రిస్‌లిన్, మిచెల్ మార్ష్, డేల్ స్టెయిన్, పాట్ కమిన్స్ తదితరులు ఉన్నారు. ఐపీఎల్‌లో ఒక్కో టీమ్‌లో గరిష్టంగా 25 మంది క్రికెటర్లు మాత్రమే ఉండాలనేది నిబంధన. ఇందులో 8 మంది విదేశీ క్రికెటర్లు ఉండొచ్చు. అయితే.. తుది జట్టు (ప్లేయింగ్ 11)లో మాత్రం నలుగురు విదేశీ క్రికెటర్లని మాత్రమే ఆడించాల్సి ఉంటుంది. వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వద్ద అత్యధికంగా రూ. 42.70 కోట్లు డబ్బు ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి 11 మంది ఆటగాళ్లని తీసుకునే వెసులబాటు ఉంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ. 17 కోట్లు ఉండగా.. ఏడుగుర్ని కొనుగోలు చేసే వీలుంది. ఇందులో ఇద్దరు విదేశీ క్రికెటర్లకి ఛాన్స్ దక్కనుంది. అత్యల్పంగా చెన్నై సూపర్ కింగ్స్‌ కేవలం ఐదుగురు ఆటగాళ్లని మాత్రమే వేలంలో కొనుగోలు చేసే వెసులబాటు ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa