ఆస్పత్రుల్లో నాడు–నేడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు, ఇంకా అమలు చేయాల్సిన వాటిపై సీఎంకు అధికారులు వివరించారు. సబ్‌సెంటర్లు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్తగా నిర్మించదలచిన కిడ్నీ, క్యాన్సర్ ఆస్పత్రులకు నిధుల సమీకరణ, ఖర్చుపై సమావేశంలో చర్చ జరిపారు.
ఇప్పటివరకూ ఇవి.. అమలు చేశాం.. .: అధికారులు
నవంబర్ 1 నుంచి హైదరాబాద్‌లో 72, బెంగుళూరులో 35, చెన్నైలోని 23 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద సూపర్‌స్పెషాల్టీ సేవలు అందిస్తున్నామని, డిసెంబర్ 2 నుంచి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో రోగులకు ఆర్థిక సహాయాన్ని , డిసెంబర్ 15 నుంచి ఆస్పత్రుల్లో 510 రకాల మందులను అందుబాటులో ఉంచామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా సదరం క్యాంపులు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఇకపై ఇవి అమలు చేస్తాం…. : అధికారులు
జనవరి 1 నుంచి అమలు చేయనున్న కార్యక్రమాలు
కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తాం, తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హిమోఫిలియా, డయాలసిస్ రోగులకు రూ.10వేల చొప్పున పెన్షన్లు ఇస్తామని, అలాగే బోదకాలు, వీల్‌ఛైర్లకు పరిమితమైన వారు, తీవ్రపక్షవాతంతో బాధపడుతున్నవారికి జనవరి నెలనుంచి పెన్షన్లు, కుష్టువ్యాధితో బాధపడుతున్నవారికి నెలకు రూ.3వేల పెన్షన్, జనవరి నెలనుంచి పెన్షన్లు, ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల జీతాలు రూ.8వేల నుంచి రూ.16వేలకు పెంపు, మార్చి 2020 నాటికల్లా నుంచి 1060 కొత్త 104, 108 అంబులెన్స్‌ల కొనుగోలు, మే చివరినాటికి ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని పోస్టుల భర్తీ,
జనవరి 3న పశ్చిమగోదావరి జిల్లాలో 2వేల రోగాలకు ఆరోగ్యశ్రీ, పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు, జనవరి 3న ప.గో.జిల్లాలో సీఎంచే ప్రారంభం మిగిలిన 12 జిల్లాల్లో కూడా 1200 రోగాలకు ఆరోగ్యశ్రీ, ఇందులో క్యాన్సర్ రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని సీఎం స్పష్టంచేసారు.
సదరం క్యాంపుల్లో రద్దీని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తామని, గతంలో వారానికి కేవలం 2715 స్లాట్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 8680 స్లాట్లను అందుబాటులోకి తెచ్చామని, బుక్ చేసుకున్న వారం రోజులకే స్లాట్ దొరికే పరిస్థితి ఇప్పుడు ఉందని అధికారులు తెలిపారు. కంటివెలుగు కింద ఇప్పటివరకూ 64,52,785 మంది పిల్లలకు పరీక్షలు 4,33,600 మందికి సమస్యలు ఉన్నట్టుగా గుర్తింపు, ఇప్పటివరకూ 3,59,396 మందికి రెండోదశ స్క్రీనింగ్ పూర్తయ్యిందని, వైద్యం చేయించుకోవాల్సిన వారు 1,86,100
1,36,313 మంది కంటి అద్దాలు ఇవ్వాలని , 41,592 మందికి 5శాతం పైన సైట్‌ఉన్నట్టు నిర్ధారణ, అయితే వీరికి మళ్లీ స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించారు. కనీసం 2–3వేలమంది శస్త్రచికిత్సలు అవసరమని గుర్తింపు, ఇదే తరహాలో వృద్ధులకు స్క్రీనింగ్ ప్రారంభించాలని ఆదేశించారు.
నాడు – నేడు కోసం డిసెంబరు, జనవరి, మార్చిల్లో మూడు విడతల్లో టెండర్లు నిర్వహించాలని నిర్ణయం, 5వేల హెల్త్ సబ్ సెంటర్లకు పనులు జనవరిలో ప్రారంభం అవుతాయని, జనవరి మూడు లేదా నాలుగోవారంలో పనులకు శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు.
సీఎం ఏమన్నారంటే:
లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని, ఎవరైనా మిగిలిపోతే ఎవర్ని సంప్రదించాలి, ఎవరికి దరఖాస్తు చేయాలన్న అంశాలను అందులో పొందుపరచాలని సీఎం తెలిపారు. ఏప్రిల్ నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం మందులు అందించాలని సీఎం ఆదేశించారు. నాడు – నేడు కింద చేపట్టే కార్యక్రమాలు నాణ్యతతో ఉండాలని, ఆస్పతుల్లో బెడ్లు, బాత్‌రూమ్స్ అన్నీ కూడా నాణ్యతతో ఉండాలని, తీవ్రవ్యాధులతో బాధపుడుతున్నవారికి ధృవీకరణ పత్రాలు ఇచ్చే పద్ధతి సులభతరంగా ఉండాలన్నారు సీఎం. ఏఎన్‌ఎం సహాయంతో స్లాట్ బుక్ చేయించాలన్న సీఎం వెంటనే పరీక్షలు, సర్టిఫికెట్ జారీచేసేలా చూడాలన్నారు. దగ్గర్లో ఉన్న ఏరియా ఆస్పత్రుల్లోనే ఈ పరీక్షలు పూర్తికావాలని రోగులకోసం ప్రత్యేకంగా వాహన సదుపాయం ఏర్పాటు చేయాలని తెలిపారు సీఎం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa