అతి తక్కువ సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ కంపెనీ సీఈవోగా వ్యవహరిస్తున్న సుందర్ పిచాయ్ తాజాగా ఆల్ఫాబెట్ సీఈవోగా కూడా నియమితులైన విషయం మనకు విదితమే. ఈ క్రమంలో సుందర్ పిచాయ్ తన పనితీరు లక్ష్యాలను చేరుకుంటే వచ్చే మూడేళ్లలో స్టాక్ అవార్డు రూపంలో భారీ మొత్తాన్ని అందుకోనున్నారు. స్టాక్‌ప్యాకేజీలో భాగంగా 240 మిలియన్ అమెరికన్ డాలర్ల(రూ.1,721కోట్లు), 2 మిలియన్ డాలర్ల(14 కోట్లు)ను వార్షిక వేతనంగా తీసుకోనున్నారు.
ఇట్టి పనితీరు-ఆధారిత స్టాక్ అవార్డులను కంపెనీ తొలిసారిగా ప్రవేశపెట్టడం విశేషం. ఈ నేపథ్యంలో తన ఆర్ధిక విత్తనంతో పాటుగా అదనంగా రూ. 640కోట్లను జీతంగా అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోఈ నూతన సంవత్సరం నుండి సుందర్ పిచాయ్ 2 మిలియన్ డాలర్లను వేతనంగా పొందనున్నట్లు ఆల్ఫాబెట్ సెక్యూరిటీస్ ఎక్సేంజ్ కమిషన్‌కు ఆల్ఫాబెట్ తెలిపింది. అలాగే పరిహార ప్యాకేజీ కూడా పిచాయ్ అందుకోనున్నట్లు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa