పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి. సీఏఏపై వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు ఈ చట్టంపై ప్రజల్లో నెలకొన్న అపోహలను నివృత్తి చేసేందుకు బీజేపీ నడుంబిగించింది. దేశవ్యాప్తంగా వెయ్యి ర్యాలీలు, 250 మీడియా సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ ర్యాలీల ద్వారా సీఏఏపై ప్రజల్లో నెలకొన్న అపోహలను నివృత్తి చేస్తామని, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను దూరం చేస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ తెలిపారు. సీఏఏపై కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa