కడప జిల్లా : వేముల మండలం వేముల గ్రామంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. స్థానిక జూనియర్ కళాశాల వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను హైచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా తలుపుల మండలం సిద్ధగురు పల్లి గ్రామానికి చెందిన కూలీలు వేంపల్లి మండలం కొత్తూరు గ్రామంలో పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులు ఇంద్రాణి, గంగోజి అమ్మ, నారాయణమ్మ, గంగులమ్మ లక్ష్మీదేవిగా గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa