ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో సారి చంద్రబాబుపై విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 26, 2020, 02:28 PM

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. రాష్ట్రాల ప్రతిపక్ష నాయకులకు ర్యాంకింగ్స్ ఇస్తే చంద్రబాబుకు చివరిస్థానం కూడా దక్కదని ఎద్దేవా చేశారు. ఈ ఎనిమిది నెలల్లో ఒక అజెండా లేదు, ప్రజాసమస్యలపై గళమెత్తిన సందర్భంలేదని వ్యాఖ్యానించారు. ఇసుక మాఫియాను కాపాడేందుకు కొరత అంటూ రంకెలేశాడని, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవతారమెత్తి జోలెతో ఊరేగుతున్నాడని విమర్శించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa