భారత 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఢిల్లీలో రాజ్ పథ్ వేదికగా జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి రాంనాథ్ కోవిండ్ జెండా ఆవిష్కరించి సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. జెండా ఆవిష్కరణ సందర్భంగా ఇండియన్ ఆర్మీ 21-గన్ సెల్యూట్ చేసింది. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో హాజరయ్యారు. త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించడంతో కన్నుల పండువగా పెరేడ్ జరిగింది. వివిధ రాష్ట్రాలు, శాఖలు శకటాలను ప్రదర్శించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa