ఏపీ సీఎం జగన్ స్పందన కార్యక్రమం పై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారుల పనితీరును ఆయన అభినందించారు. అదే విధంగా పలు పథకాల అమలు పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామాలలో వచ్చిన దరఖాస్తులలో 60 శాతం బియ్యం కార్డులు, పెన్షన్లు,ఇళ్ల పట్టాలకు సంబంధించినవి ఉన్నాయన్నారు. సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు విధంగా ఉన్నాయి.
- ఫిబ్రవరి 1 నుంచి ఇంటికే పెన్షన్లు.
- ఫిబ్రవరి 15లోగా ఇళ్ల పట్టాల అర్హుల జాబితా సిద్దం.
- ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ.
- లాటరీ పద్దతి ద్వారా ఇళ్ల కేటాయింపు.
- ఫిబ్రవరి 28న విద్యాదీవెన వసతి పథకం ప్రారంభం.
- ఏప్రిల్ నెలాఖరు నాటికి 11వేల రైతుభరోసా కేంద్రాల ఏర్పాటు.
- ఫిబ్రవరి 28న 3300 రైతుభరోసా కేంద్రాల ప్రారంభం.
- గ్రామ,వార్డు సచివాలయాల్లో ప్రతిరోజు స్పందన కార్యక్రమం.
- ఫిబ్రవరి 1 నుంచి వైఎస్సార్ కంటి వెలుగు మూడో దశ ప్రారంభం. 1.25 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయాలని నిర్ణయం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa