జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి రోజున ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాడ్సే ఓ దేశభక్తుడంటూ బీజేపీ ఎంపీలు సంబరాలు జరుపుకుంటున్నారని ఆరోపించారు. గాడ్సేను బహిరంగంగా నిందించేందుకు వారు నిరాకరిస్తున్నారని, పైగా, అతడి ఉద్దేశాలను అర్థం చేసుకోవాలంటూ సూచిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారు ఓ ఉగ్రవాదిని క్షమిస్తున్నారని, అతడి దుశ్చర్యను దేశభక్తిగా చిత్రీకరించే ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఒవైసీ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa