పొగాకు మనిషి వినాశనానికి కారకమవుతుంది. చాలా మంది పొగాకుకు బానిసై తమ సర్వస్వాన్నే కోల్పోతుంటారు. దాని వల్ల వాళ్లు చాలా నష్టపోతుంటారు. ఈ పొగాకు అనేది రెండు రకాలుగా లభిస్తుంది. అదే స్నఫ్, పొగాకు. ఈ స్నఫ్ ని మెత్తటి పొడిగా చేస్తే వచ్చేది స్నస్. వీటన్నింట్లో కూడా ప్రమాదకరమైన కాన్సర్ కారకాలున్నాయి. సిగరెట్స్ కంటే మూడు నాలుగు రెట్లెక్కువ పొగాకులో ఉంటుంది. దీనిని నమలడం వల్ల అది శరీరంలోకి వెళ్తుంది. ఆ తర్వాత అనేక సమస్యలకు కారణం అవుతుంది. పొగాకు నమలడం వల్ల చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశముంది. నోటికి సంబంధించిన అన్ని కాన్సర్లు కూడా రావచ్చు. బుగ్గలకీ, చిగుళ్ళకీ, పెదవులకీ, నాలికకీ, అంగిటికీ సంబంధించిన కాన్సర్లన్నీ పొగాకు నమలడం వల్ల వస్తాయి. కొన్ని అధ్యాయనాల ప్రకారం పొగాకు నమలడం వల్ల పాంక్రియాటిక్ కాన్సర్, ఈసోఫేగల్ కాన్సర్, స్టమక్ కాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పొగాకు వల్ల వచ్చే వ్యాధలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిగుళ్ళ వ్యాధులు, లుకోప్లేకియా (నోటి లోపల ఉండే తెల్లని చారలు, ఇవి కాన్సర్ గా మారే అవకాశం ఉంది), దంతక్షయం, పళ్ళ రంగు మారడం, పళ్ళు ఊడిపోడం.. వంటివి కలుగుతుంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం పొగాకు నమలడానికీ, గుండె జబ్బులకీ కూడా సంబంధముందని నిపుణులు చెబుతున్నారు. సిగరెట్ స్మోకింగ్ కంటే పొగాకు నమలడం డేంజర్ అని అంటున్నారు. పొగాకు నమలడం వల్ల ఓరల్ కాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ అలవాటుతో చిగుళ్ళ వ్యాధులు, దంత క్షయమూ, గుండె జబ్బులతో పాటూ మరికొన్ని రకాల కాన్సర్లు కూడా వస్తాయి. అయితే, పొగాకుని మానేందుకు ఓ ఉపాయం ఉంది.. సిగరెట్ స్మోకింగ్ వదిలెయ్యడానికి సాయం చేసే ఉత్పత్తులని పొగాకు అలవాటుని దూరం చేసేందుకు కూడా వాడచ్చు. సిగరెట్ స్మోకింగ్ లాగా, ఆల్కహాల్ సేవించటం లాగా పొగాకు నమలడం కూడా ఒక వ్యసనం. ఈ వ్యసనం లోంచి బయట పడడానికి మందుల దగ్గర్నించీ, కౌన్సిలింగ్ వరకూ, రకరకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వ్యసన తీవ్రత ని బట్టి కావాల్సిన పద్ధతిని ఎంచుకోవాల్సి ఉంటుంది. దగ్గర్లో వైద్యులని సంప్రదిస్తే వాటి వివరాలు అనేవి పూర్తిగా తెలుసుకోవచ్చు. కరోనా విజృంభిస్తున్న సమయంలో బయటకు వెళ్లడం ప్రమాదకరం. కానీ, మనకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ ను సంప్రదించడం తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో మీకో శుభవార్త. ఈ యాప్ తో ఇంటి దగ్గర నుండే డాక్టర్ ను సంప్రదించి వైద్య సలహాను పొందవచ్చు. అందుకోసం ఈక్రింది లింక్ పై క్లిక్ చేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa